News March 19, 2025
VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
Similar News
News October 30, 2025
VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 30, 2025
ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
News October 30, 2025
డెంకాడ: నేలకొరిగిన వరి పంట పరిశీలించిన ఉన్నతాధికారులు

డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి వీ.టి. రామారావు గురువారం పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 10,000ల చొప్పున నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని రైతులకు భరోసా కల్పించారు.


