News March 19, 2025
VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
Similar News
News March 20, 2025
సంతమాగులూరు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందిన ఘటన సంతమాగులూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టావారి పాలెం గ్రామానికి చెందిన షాహినా బేగం(68) అనే వృద్ధురాలు హైదరాబాదు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో ప్రయాణికులు 108కి సమాచారం ఇవ్వగా, అప్పటికే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
కొవ్వూరు: పట్టపగలే మహిళా మెడలో గొలుసు చోరీ

కొవ్వూరు పట్టణంలోని మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. కొవ్వూరుకు చెందిన కందుల పద్మ కుమారి (55) అనే మహిళ ఏసి ఆర్ లాడ్జ్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిల్ పై వచ్చి ఆగంతకుడు మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లాడు. స్థానికుల సమాచారంతో పట్టణ సీఐ విశ్వం డీఎస్పీ దేవకుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2025
కనిగిరి: బాలికలపై వేధింపులు.. టీచర్ అరెస్టు

కనిగిరిలోని బాలికోన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రంగారెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో కొందరు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేయడంతో నిన్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగించారు.