News February 9, 2025
VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’
విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News February 10, 2025
అల్బెండజాల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్
జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినొత్సవం సందర్భంగా సోమవారం అల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. మాత్రల్ని గుర్ల మినహా అన్ని మండలాలకు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
News February 9, 2025
VZM: మద్యం షాపుల లాటరీ వాయిదా
ఈనెల 10న విజయనగరంలో జరగాల్సిన కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి బి.శ్రీ నాథుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లాటరీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతులు వచ్చిన వెంటనే లాటరీ తేదీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
News February 9, 2025
చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.