News March 12, 2025
VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సహాయం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పీఎం జన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ అంబేడ్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందన్నారు.
Similar News
News March 13, 2025
VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.
News March 13, 2025
విజయనగరం జిల్లాలో హైవేపై 64 సీసీ కెమెరాలు: కలెక్టర్

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు 64 సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. తన ఛాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 34కి.మీ. రోడ్డుపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాల అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చూడాలన్నారు.
News March 13, 2025
ఈనెల 15న విజయనగరంలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It