News September 12, 2024

VZM: ‘ఈనెల 25 వరకు ఛాన్స్’

image

ఏపీ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి గడువు పొడిగించినట్లు డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఫైన్ లేకుండా ఈనెల 15లోగా అప్లై చేసుకోవచ్చన్నారు. రూ.200 ఫైన్ తో ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. అర్హతగలవారు సంబంధిత వెబ్ సైట్‌లో
అప్లై చేసుకోవాలన్నారు.

Similar News

News October 6, 2024

దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్

image

కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

News October 6, 2024

విజయనగరం జిల్లా టెట్ అభ్యర్థులకు కీలక UPDATE

image

విజయనగరం జిల్లాలోని టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్, నామినల్ రోల్‌లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు. ఇందుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఇంటిపేరు, బర్త్ డే మార్పుల కోసం టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డును ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులకు అందజేయాలని డీఈవో పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 6, 2024

VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.