News March 26, 2024
VZM: ఈవీఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711458945748-normal-WIFI.webp)
స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన గదులను, ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం మళ్లీ గోదాములకు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను తనిఖీ చేశారు. ఈవీఎంల తొలిదశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Similar News
News December 28, 2024
డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ IPS?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735356673010_52016869-normal-WIFI.webp)
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మక్కువ మండలంలోని గిరి శిఖర గ్రామమైన బాగుజోల పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఐపీఎస్‌తో పలువురు పోలీసులు సైతం ఫొటోలు దిగడం చర్చీనీయాంశమైంది. కాగా ఆయన ఎవరనేది పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
News December 28, 2024
హాట్ టాపిక్‌గా మారిన బొత్స
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735351866687_52016869-normal-WIFI.webp)
కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం జిల్లాలో నిన్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ నియోజకవర్గమైన చీపురుపల్లిలో సైతం భారీ ర్యాలీ జరిగింది. నిన్న విజయనగరం జిల్లాలోనే బొత్స ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏ ధర్నాలోనూ పాల్గొనలేదు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన ఆందోళనల్లో పాల్గొనలేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
News December 28, 2024
VZM: 9,152 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735314952707_50022931-normal-WIFI.webp)
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు VZM పోలీస్ పరేడ్ గ్రౌండులో పీఎంటీ, పీఈటీ పరీక్షలు డిసెంబరు 30 నుంచి జనవరి 22 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో 9,152 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అర్హత సాధించగా అందులో 1,584 మంది మహిళలు ఉండగా 7,568 మంది పురుషులు ఉన్నారు. ఉదయం 4 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్దకు హాజరు కావాలన్నారు.