News April 17, 2025

VZM: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

image

భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళా స్టేషన్ ACP పెంటారావు సంఘటనా స్థలాన్ని బుధవారం పరిశీలించారు.

Similar News

News April 20, 2025

గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

image

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 20, 2025

నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

image

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.

News April 20, 2025

VZM: మహిళ దారుణ హత్య

image

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!