News February 4, 2025
VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 4, 2025
చారకొండ: బందోబస్తు మధ్య కూల్చివేతలు
చారకొండ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి నిర్మాణం కోసం గ్రామంలోని ఊరి మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను జేసిబీలతో ఇళ్లను తొలగించారు. తొలగింపు కార్యక్రమాన్ని తహశీల్దార్ సునీత, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ ఇసాక్ హుస్సేన్ కూల్చివేతలు పర్యవేక్షించారు.
News February 4, 2025
HYDలో యాక్సిడెంట్.. మహబూబాబాద్ డాక్టర్ మృతి
HYD మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదంలో కంటైనర్ కింద పడి వైద్యుడు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ పట్టణంలోని 9వ వార్డు శనిగపురం గ్రామానికి చెందిన యువ డాక్టర్ శ్రీ చరణ్ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఉదయం మృతి చెందారు. శ్రీ చరణ్ ప్రస్తుతం HYD కిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. డాక్టర్ మృతితో శనిగపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ
JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.