News December 19, 2024
VZM: జనవరి మొదటి వారంలో పారిశ్రామిక సదస్సు
జిల్లాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా విధానాలను రూపొందించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులకు జనవరిలో పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని సూచించారు.
Similar News
News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే
రాయగడ <<15366937>>డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్
రైల్వే స్టేషన్ ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
News February 5, 2025
మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ
విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
News February 5, 2025
ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి
కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.