News March 1, 2025
VZM: నేటి నుంచి జర్నలిస్టులకు రెన్యువల్ స్లిప్పులు

జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించిందని DPRO రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి కలెక్టరేట్లోని DPRO కార్యాలయంలో రెన్యువల్ స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. రెన్యువల్ స్లిప్పులతో పాటు అక్రిడేషన్, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఆర్టీసీ కార్యాలయానికి వెళితే బస్సు పాస్ ఇస్తారని చెప్పారు.
Similar News
News March 1, 2025
VZM: ప్రేమ వ్యవహారమే మృతికి కారణం..!

తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనార్ధన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని, డిగ్రీ చదివిన సమయంలో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి కుమార్ తెలిపారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 1, 2025
VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
News February 28, 2025
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: కిమిడి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రూ.3,22,359 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసిందన్నారు.