News January 22, 2025

VZM: పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న విద్యార్థులు

image

జిల్లా కేంద్రంలో ఆయాన్ పరీక్ష కేంద్రం వద్ద జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు చేరుకుంటున్నారు. విజయనగరం జిల్లా నుంచి మెయిన్స్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఆయాన్ సంస్థ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్నారు.

Similar News

News January 22, 2025

VZM: కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

image

దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థి బౌడుపల్లి రవి కుమార్ (22) బుధవారం మృతి చెందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జనవరి 21న విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన పీఈటీ పరీక్షలకు రవి హాజరయినట్లు చెప్పారు. 1,600 మీటర్ల పరుగులో పాల్గొని అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, విశాఖలోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

News January 22, 2025

బొబ్బిలిలో మరో కేంద్రం ప్రారంభిస్తాం: భరత్ కౌశల్

image

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన సాగుతోంది. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో భేటీ అయిన లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖ మెట్రో, గ్రీన్ ఎనర్జీకి సాంకేతిక సహకారం అందించాలని కోరారు. జేసీహెచ్-ఐఎన్ ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, కాకినాడలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించామన్న భరత్.. బొబ్బిలి, అనంతపురంలో మరో 2 కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు.

News January 22, 2025

VZM: కానిస్టేబుల్ ఎంపికలు..448 మంది ఎంపిక

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య ఎంపిక ప్రక్రియ మంగళవారం సజావుగా జరిగింది. మొత్తం 652 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 448 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు. గడిచిన 15 రోజులుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు 3,745 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళ అభ్యర్థినులు రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.