News February 28, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

image

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 28, 2025

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: కిమిడి

image

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రూ.3,22,359 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసిందన్నారు.

News February 28, 2025

NDPS కేసుల్లో హిస్టరీ సీట్లు తెరవాలి: SP

image

విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులకు హిస్టరీ సీట్లు తెరవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా కేసులపై దృష్టి సారించాలని సూచించారు.

News February 28, 2025

రెండు రోజుల్లో 24 మందిపై కేసు: VZM ఎస్పీ

image

విజయనగరం సిటీ పరిధిలోని రెండు రోజుల్లో 24 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో పట్టుబడిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షల జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!