News February 28, 2025
VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2025
ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
News February 28, 2025
డ్రగ్స్ రహిత జిల్లాగా పల్నాడు: కలెక్టర్

డ్రగ్స్ రహిత జిల్లాగా పల్నాడును తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి. అరుణ్ బాబు, SP శ్రీనివాసరావు అధికారులను శుక్రవారం ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలను వారు సూచించారు. మద్యం, మెడికల్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యాసంస్థలకు దూరంగా మద్యం విక్రయ కేంద్రాలు ఉండాలన్నారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. 3 నెలలకు ఒకసారి దీనిపై సమీక్ష ఉంటుందన్నారు.
News February 28, 2025
రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్‌కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.