News March 7, 2025
VZM: ‘పోలవరం ప్రధాన కాల్వ భూసేకరణ ప్రారంభించాలి’

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పోలవరం ప్రధాన కాల్వ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అంబేడ్కర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణపై కలెక్టర్ గురువారం తన ఛాంబరులో జలవనరుల శాఖ, భూసేకరణ అధికారులతో సమీక్షించారు. విజయనగరం జిల్లాలోని మూడు భూసేకరణ యూనిట్ల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచే ప్రారంభించాలన్నారు.
Similar News
News March 9, 2025
VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.
News March 8, 2025
విజయనగరంలో 3వేల మంది మహిళలతో ర్యాలీ: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 7, 2025
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 21 లోక్ అదాలత్ బెంచీలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు చెక్ బౌన్స్, ప్రాంసరీ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ల్యాండ్, తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.