News November 8, 2024

VZM: బాధితులకు 300 ఫోన్లు అప్పగింత

image

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు 300 ఫోన్లను తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లను తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు అప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, ఎస్పీకు బాధితులు కృతజ్ఞతలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్య లత పాల్గొన్నారు.

Similar News

News November 22, 2024

VZM: జిల్లాలో కనిపించని మాజీలు

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల జాడ కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సొంతపార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సైతం ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పెనుమత్స కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

News November 22, 2024

ఇక నుంచి స్థానికంగా ప్రజా పరిష్కార వినతుల స్వీకరణ: JC

image

ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని JC సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీవో, తహసిల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

News November 21, 2024

VZM: రామతీర్థం అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవే..

image

జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్‌వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.