News December 23, 2024

VZM: యువతకు దారి చూపిస్తున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి

image

విజయనగరంలో నిరుద్యోగ యువతి, యువకులు కోసం గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని సాధనతో రామారావు (రిటైర్డ్ ఆర్మీ) ఉద్యోగి నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇతని దగ్గర శిక్షణ పొందిన వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల్లో కోలువులు తీరారు. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జీడీ ఫలితాలలో మొత్తం 80 విద్యార్థులు ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావుని విద్యార్దులు ఘనంగా సన్మానించారు.

Similar News

News December 24, 2024

విజయనగరం: జిల్లాలో మూడు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు

image

విజయనగరం జిల్లాలో రానున్న మ‌రో మూడు రోజుల‌ు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, జిల్లా యంత్రాంగ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమ‌వారం ఒక మోస్త‌రు వ‌ర్షాలు, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరిక‌ల నేప‌థ్యంలో రైతులంతా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో క‌లెక్ట‌ర్‌ కోరారు.

News December 23, 2024

విజయనగరం వై జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

వీటీ అగ్రహారానికి చెందిన మురళీ విజయనగరం వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఏఎస్ఐ రామరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటివద్ద నుంచి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

News December 23, 2024

VZM: నేడు జిల్లాకు ఓటర్ల జాబితా పరిశీలకులు రాక

image

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంపై పరిశీలించే నిమిత్తం ఎలెక్టోరల్ రోల్ పరిశీలకులు, రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషగిరి బాబు సోమవారం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం 3-00 గంటలకు జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ అధికారులు, జిల్లాకు చెందిన ఎం.పి., ఎం.ఎల్.ఏ.లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమేక్షిస్తారన్నారు.