News February 1, 2025
VZM: రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి రాజకీయ ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2025
VZM: గెలుపు దిశగా గాదె.. దేనికి సంకేతం?

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. మాజీ MLC రఘువర్మకు కూటమి మద్దతు పలికింది. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు రఘువర్మను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను కాదని గాదెకే గురువులు పట్టం కట్టారనేది లెక్కింపులో స్పష్టమవుతుంది. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారని పలువురు భావిస్తున్నారు.
News March 3, 2025
బొబ్బిలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు

బొబ్బిలి- డొంకినవలస మధ్యలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో సోమవారం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రాయగడ- విజయనగరం మధ్య రైళ్లు స్తంభించాయి. విశాఖ-కొరాపుట్ పాసింజర్ ట్రైన్ బొబ్బిలి రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విజయనగరం నుంచి మరో రైలింజన్‌ను తెప్పించే ఏర్పాట్లు చేశారు.
News March 3, 2025
VZM: ‘లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను చిట్స్, ఫైనాన్స్ కంపెనీలు వినియోగించుకోవాలని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి సూచించారు. జిల్లా కోర్టు సముదాయంలో చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. చిట్టీ కేసులకు సంబంధించి ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.