News July 15, 2024

భోజనం చేశాక నడిస్తే లాభాలివే..

image

నడక ఆరోగ్యకరమైన అలవాటు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి భోజనం తర్వాత చాలా మంది నడిచేందుకు ఇష్టపడుతుంటారు. భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఓ డాక్టర్ వివరించారు. ‘భోజనం చేశాక 15 నిమిషాల తర్వాత నడవడం సురక్షితం. దీని ద్వారా జీర్ణవ్యవస్థ మరింత వేగంగా పనిచేస్తుంది. మానసిక స్థితి & నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో HbA1C 0.5% తగ్గుతుంది’ అని తెలిపారు.

Similar News

News January 21, 2025

6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు

image

AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.

News January 21, 2025

RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!

image

TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.

News January 21, 2025

నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం

image

TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.