News February 22, 2025
ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT
Similar News
News February 22, 2025
ట్రంప్ బాంబు: USAID డబ్బులిచ్చింది భారత్‌కే

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ బాంబు పేల్చారు. ఓటింగ్ పెంచేందుకు USAID $21M కేటాయించింది భారత్‌కేనని వరుసగా మూడోరోజూ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు ప్రత్యేకంగా $29M ఇచ్చారని చెప్పారు. USAID డబ్బులిచ్చింది భారత్‌కు కాదని బంగ్లాకని నిన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన కథనాన్ని కొందరు జర్నలిస్టులు, ఫ్యాక్ట్‌చెకర్లు విపరీతంగా ప్రచారం చేశారు. దానిని ఖండిస్తున్నట్టుగా ట్రంప్ వేర్వేరుగా వివరాలు చెప్పడం గమనార్హం.
News February 22, 2025
రూ.250 కోట్లకు చేరువైన ‘ఛావా’

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న ఈ మూవీ థియేటర్లలో రూ.24 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలైన 8 రోజుల్లోనే రూ.249.31 కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News February 22, 2025
అమరావతి పనులు ఆలస్యం?

AP: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభంలో స్వల్ప జాప్యం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టెండర్లు పిలిచినా వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు 62 పనులకు CRDA, ADC టెండర్లను ఆహ్వానించాయి. రూ.40వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.