News August 11, 2024
వాకింగ్VSజాగింగ్.. ఏది మంచిది?

వాకింగ్, జాగింగ్ రెండూ ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. రోజూ 30min చురుగ్గా వాకింగ్ చేస్తే 150-200 కేలరీలు, జాగింగ్ చేస్తే 300-400 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు, కాళ్ల నొప్పులు ఉన్న వారు, గుండె ఆపరేషన్లు అయినవారు జాగింగ్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 25, 2026
రేపు వైన్ షాపులు బంద్

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జనవరి 26న డ్రై డేగా పరిగణిస్తారు. తిరిగి జనవరి 27న షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠినచర్యలు తీసుకోనుంది.
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్గా భక్తులను ఆకర్షిస్తోంది.


