News October 21, 2024

రైతుబంధు కావాలా? రాబందు కావాలా?: KTR

image

TG: ఎకరానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పదివేలు ఊడగొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు కావాలా?.. రాబందు కావాలా? అని Xలో ప్రశ్నించారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుగా పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే, అన్నదాత వెన్ను విరవడమేనని దుయ్యబట్టారు.

Similar News

News October 21, 2024

హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

image

ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై గతంలో కేసు నమోదైంది.

News October 21, 2024

ఘోరం.. తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

image

సిలికాన్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.

News October 21, 2024

NZ లేడీ సూపర్ స్టార్

image

టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాట్ & బాల్‌తో టీమ్ గెలుపులో కీలకంగా మారిన ఆల్ రౌండర్ అమేలియా కెర్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. టోర్నీలో ఆమె 15 వికెట్లు పడగొట్టి సింగిల్ T20 WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ టోర్నీలో ఆమె తీసిన వికెట్లు వరుసగా.. 1/19 vs IND, 4/26 vs AUS, 2/13 vs SL, 3/14 vs PAK, 2/14 vs WI, 3/24 vs SA (Finals).