News May 10, 2024

విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా?: చంద్రబాబు

image

వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘వైసీపీ అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలి. జగన్ ప్రభుత్వం వల్ల అన్ని విషయాల్లో నష్టపోయాం. ఐదేళ్లలో ఒక్క మంచి పని చేశారా? విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? ప్రజలు తేల్చుకోవాలి’ అని సూచించారు.

Similar News

News January 8, 2025

విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు

image

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.

News January 8, 2025

ఈ ప్రాజెక్టులతో సరికొత్త శిఖరాలకు ఏపీ: మోదీ

image

APలో ఇవాళ తాము శ్రీకారం చుట్టిన రూ.2.10లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. IT, టెక్నాలజీకి AP ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు. విశాఖకు కేటాయించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతో మందికి ఉపాధి ఇస్తుందని, 3 రాష్ట్రాల్లోనే వస్తున్న బల్క్ డ్రగ్ పార్కును విశాఖ(నక్కపల్లి)కి కేటాయించామన్నారు.

News January 8, 2025

ఏసీబీ కార్యాలయంలో ముగిసిన అరవింద్ కుమార్ విచారణ

image

TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్‌ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు.