News October 25, 2024
మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే?

ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.
Similar News
News January 20, 2026
2026 పెళ్లి ముహూర్తాలు ఇవే: పండితులు

శుక్ర మౌఢ్యమి కారణంగా ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు.
*ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
*ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *AUG నుంచి OCT వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవు.
*నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12
News January 20, 2026
రాసలీలల వీడియో వైరల్.. కర్ణాటక DGPపై సస్పెన్షన్ వేటు

కర్ణాటక సీనియర్ IPS, <<18898562>>DGP<<>> ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తన ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘన కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ విచారణకు ఆదేశించింది. అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని రామచంద్రరావు వాదిస్తున్నారు.
News January 20, 2026
వెంకీ ‘AK-47’లో నారా రోహిత్?

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’(AK-47)లో హీరో నారా రోహిత్ నటిస్తారని తెలుస్తోంది. విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ రోల్లో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ కొనసాగుతుండగా రోహిత్ పాల్గొన్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా విడుదల తేదీ మారుస్తారని టాక్.


