News September 7, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?

* దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి.
* పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి.
* పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి.
* పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి.
* దాణాను వీలైనంత వరకు నానబెట్టి ఇవ్వాలి.
Similar News
News September 8, 2025
నేడు CPGET-2025 ఫలితాలు

TG: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET-2025) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. గత నెల 6 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షకు 45,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. CPGET <
News September 8, 2025
జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

పనిమనిషిపై అత్యాచారం కేసులో హాసన్ (కర్ణాటక) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన ఆగ్రహార జైలులో ఉన్న ఆయనకు అధికారులు లైబ్రరీ క్లర్క్ పనిని కేటాయించారు. ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి వివరాలు నమోదు చేయడమే పని. రోజుకు ₹522 జీతంగా ఇస్తారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు నెలకు కనీసం 12, వారానికి 3 రోజులు పని చేయాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News September 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.