News November 27, 2024

వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

image

బరువు తగ్గడం అంత తేలిక కాదు. కానీ సరైన డైట్, జీవనశైలి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్, షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఒకపూట పూర్తిగా ఉడికించిన కూరగాయలు తినాలి. రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. సమృద్ధిగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువసేపు వ్యాయామం చేయాలి. రాత్రి 9 గంటలలోపే నిద్రించాలి.

Similar News

News November 22, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులు

image

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in

News November 22, 2025

నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

image

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.