News October 3, 2025
భగవంతుణ్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలంటే?

‘దేవుడు ఆనందమయుడు. ఆయణ్ను ప్రత్యక్షంగా చూడాలంటే భక్తియే ఉత్తమ మార్గం’ అని పండితులు చెబుతున్నారు. ఎన్ని విఘ్నాలు ఎదురైనా.. ధ్రువునిలా భగవంతుడి ధ్యానములో నిశ్చలంగా ఉన్నవారికే దేవుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. శ్రీహరి సాక్షాత్కారం కోసం తల బలివ్వడానికైనా సిద్ధమైన ప్రహ్లాదుడిలా, రాముణ్ని సేవించడానికి లక్ష్మణుడిలా భార్యను, ఐశ్వర్యాలను, రాజ్యాన్ని వదిలి వనములకు వెళ్లేలా ఉండాలని సూచిస్తున్నారు. <<-se>>#bakthi<<>>
Similar News
News October 3, 2025
మహిళా ఖైదీలకు ‘అపూర్వ’ కానుక

క్షణికావేశంలో తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు టీచర్‌గా మారారు అపూర్వ వివేక్. ఝార్ఖండ్ రాంచీకి చెందిన ఈమె 2013 నుంచి ఖైదీల సేవకే తన సమయాన్ని కేటాయించారు. న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి, వారి పిల్లలకు చదువు చెబుతున్నారు. అలాగే వారిలో కుంగుబాటును నివారించడానికి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి పునరావాసం, ఉపాధి కల్పన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News October 3, 2025
ఈ మంత్రం జపిస్తే మీ వెంటే శివుడు

‘ఓం నమ:శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే పాపాలు తొలగి, ఆత్మశుద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ మంత్రం జపించిన వారికి శివుడు రక్షణగా ఉంటాడు. శరీరం పవిత్రంగా మారడానికి, జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఐదక్షరాలే మహా ద్వారం. రోజూ పఠిస్తే ఎంతో పుణ్యం’ అని పేర్కొంటున్నారు.
* రోజూ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం, ధర్మ సందేహాలకు సమాధానాల కోసం <<-se_10013>>‘భక్తి’ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 3, 2025
ఇథిహాసం క్విజ్ – 24 సమాధానాలు

1. రావణాసురుడు ‘పులస్త్య’ వంశానికి చెందినవాడు.
2. శ్రీరాముడు ‘నవమి’ తిథిన జన్మించాడు.
3. కర్ణుడిని రాధ, అధిరథుడు దత్తత తీసుకున్నారు.
4. క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశాన్ని విష్ణువు మోహినీ రూపంలో వచ్చి తీసుకున్నారు.
5. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున మనం ‘హోళీ’ జరుపుకొంటాం.
<<-se>>#mythologyquiz<<>>