News September 7, 2024

ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా: సీఎం

image

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. వీధులన్నీ చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయి. వారి బాధలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 31, 2026

మత మార్పిడి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా: కౌశిక్ రెడ్డి

image

TG: కరీంనగర్ CP మతమార్పిడి చేస్తున్నట్లు తాననలేదని BRS MLA కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ‘TG IPS ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను అలా అన్నట్లు నిరూపిస్తే MLAగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో వారిపై ప్రివిలేజ్‌ మోషన్ మూవ్ చేస్తా’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

News January 31, 2026

ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఢిల్లీ <<>>హైకోర్టులో 152 జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్/రోస్టరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత గలవారు FEB 4 – 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్ (డిస్క్రిప్టివ్) పరీక్ష, టైప్ టెస్ట్ (నిమిషానికి 35వర్డ్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://delhihighcourt.nic.in

News January 31, 2026

మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

image

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.