News March 24, 2024
త్రిప్తితో డేటింగ్ చేయాలనుంది: నటుడు

యానిమల్ సినిమాలో నటించిన త్రిప్తి దిమ్రీ గ్లామర్‌కు యూత్ ఫిదా అయింది. ఆ ఒక్క సినిమాతో ఆమె నేషనల్ క్రష్‌గా మారిపోయారు. కాగా ఇదే సినిమాలో హీరో రణ్‌బీర్ కపూర్‌కి బావగా నటించిన సిద్ధాంత్ కర్నిక్ కూడా త్రిప్తిపై మనసు పారేసుకున్నట్లున్నారు. ఆమెతో డేటింగ్ చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
ఐదో టీ20: టాస్ ఓడిన భారత్

అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో హర్షిత్, గిల్, కుల్దీప్ స్థానాల్లో బుమ్రా, శాంసన్, సుందర్ వచ్చారు.
IND: సూర్య(C), శాంసన్, అభిషేక్, తిలక్, పాండ్య, జితేశ్, సుందర్, దూబే, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్
News December 19, 2025
Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్‌మెయిల్‌కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News December 19, 2025
వైఎస్ జగన్ బర్త్ డే CDP పోస్ట్ చేసిన వైసీపీ

AP: ఎల్లుండి వైసీపీ చీఫ్ జగన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన CDPని ఆ పార్టీ Xలో పోస్ట్ చేసింది. ప్రజా నాయకుడు జగన్ అని పేర్కొంటూ ఫొటోను రిలీజ్ చేసింది. ‘సవాళ్లు ఎదురైనా.. కష్టాలు పరీక్షించినా మొక్కవోని దీక్షతో నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధతతో నిలబడే నాయకుడు వైఎస్ జగన్. పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ అన్న’ అని ట్వీట్ చేసింది.


