News April 28, 2024
ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా

‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో పాత్రతో పాటు ప్రాధాన్యం, నిడివి అన్నీ చూస్తానని చెప్పారు. మాస్ మసాలా చిత్రాలు చేయాలని ఉందన్నారు. ఇండస్ట్రీలో యాక్షన్ మూవీస్ చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారని.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఈ అమ్మడు నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ మే 3న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News February 21, 2026
దేశీ ఆవులో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణాలు

దేశీ ఆవుల్లో ఇతర ఆవులు, గేదెలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలుంటాయి. దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. పాలు తీసేటప్పుడు గేదె తన పొదుగులో ఉన్న పాలను మొత్తం ఇచ్చేస్తుంది. ఆవు అలా కాదు. తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచి, పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. దేశీ ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఎక్కువ. గేదెలు ఎండలను తట్టుకోలేవు. ఆవులు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలవు.
News February 21, 2026
సిరీస్ పట్టేస్తారా? నేడే AUSతో చివరి టీ20

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచులో భారత మహిళల జట్టు ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తొలి టీ20లో వర్షం పడటంతో D/L పద్ధతిలో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచులో ఆసీస్ చేతిలో 19 రన్స్ తేడాతో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఇక AUS పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, ఒక టెస్ట్ కూడా ఆడనుంది.
News February 21, 2026
అవకాడో సాగు.. మొక్కలు నాటే విధానం

వసంతకాలంలో తగినంత ఉష్ణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవకాడో అంటుకట్టిన మొక్కలను లేదా మొగ్గ తొడిగిన మొక్కలను నాటాలి. 1x1x1 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గుంతలను తవ్వుకొని 1 : 1 : 1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుల మిశ్రమాన్ని నింపాలి. అనంతరం మొక్కలను నాటుకోవాలి. వరుసలలోని 2 మొక్కలకి మధ్య దూరం 15- 20 అడుగులు ఉండాలి. రెండు వరుసలకు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.


