News April 20, 2024

మళ్లీ ఇండియాకు ఆడాలని ఉంది: డీకే

image

మరోసారి తనకు టీమ్ ఇండియా తరఫున ఆడాలని ఉందని ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తీక్ అన్నారు. ‘నా కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నా. 100 శాతం సిద్ధంగా ఉన్నా. టీ20 ప్రపంచకప్‌లో నా సేవలు అందించాలని అనుకుంటున్నా. జట్టు గెలుపు కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు బాదారు.

Similar News

News April 3, 2026

ICMR-NIIRND, రాజస్థాన్‌‌లో ఉద్యోగాలు

image

ICMR-NIIRND, రాజస్థాన్‌.. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1, ప్రాజెక్ట్‌ నర్సు-2, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ లేదా పీజీతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వూ తేదీ- APR-9. పూర్తి వివరాలకు www.icmr.gov.in చూడండి.

News April 3, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్.సరస్వతి’

image

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎస్.సరస్వతి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని భాషలను యాడ్ చేయనున్నారు. మార్చి 6న రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రావు రమేశ్, మురళీ శర్మ, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

News April 3, 2026

ట్రంప్ మావా.. అసలు నీ బాధేంటి?

image

ఇరాన్‌తో యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీరు, <<19543167>>ప్రకటనలు<<>> గందరగోళానికి గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను నాశనం చేశామని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామన్నారు. ఇవాళ ఆ దేశం డీల్ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. నిజంగానే ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ డీల్ కోసం అడుక్కోవడం ఎందుకని SMలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. <<19538873>>హార్ముజ్‌పైనా<<>> ఆయన పూటకో మాట <<19487591>>మాట్లాడటంపై<<>> విమర్శలొస్తున్నాయి.