News August 5, 2024
వక్ఫ్ సవరణ బిల్లు: మొదట రాజ్యసభలోనే!

వక్ఫ్ బోర్డు అధికారాల సవరణ బిల్లును ఈ వారమే రాజ్యసభలో ప్రవేశ పెడతారని సమాచారం. ముస్లిం మేధావుల అభిప్రాయాల మేరకు కేంద్రం 32-40 సవరణలు చేయనుంది. 1954, 1995, 2013లో కేంద్రం వక్ఫ్కు అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. అయితే భూ ఆక్రమణ, ఆస్తుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ భూమిలో విద్యా సంస్థలు, ఆస్పత్రులు కట్టించి ముస్లిములకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని UP మంత్రి డానిష్ ఆజాద్ చెప్పారు.
Similar News
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.


