News April 2, 2025
వక్ఫ్ సవరణ బిల్లు.. మీ అభిప్రాయం?

వక్ఫ్ అంటే ముస్లింలు చేసే దానం. ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని అంచనా. వాటిలో చాలావాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ఒక ఆస్తిని వక్ఫ్గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాల్ని తగ్గించి బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆ సవరణపై మీ అభిప్రాయం? కామెంట్ చేయండి.
Similar News
News November 25, 2025
ఉంగుటూరు: సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఉంగుటూరు నియోజకవర్గంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, సీఎం పాల్గొనే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం ప్రాంతాన్ని పరిశీలించారు.
News November 25, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 25, 2025
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఉద్యోగాలు

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<


