News April 1, 2025

WAQF BILL: నేడు బీఏసీ మీటింగ్!

image

వక్ఫ్ సవరణ బిల్లును ఈ వారంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) నేడు సమావేశం కానున్నట్లు తెలిసింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు, చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. కాగా బిల్లుపై వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. వక్ఫ్ లా అనేది స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉందని, దానిని సవరించడం చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Similar News

News November 28, 2025

మేడారంలో వనదేవతల దర్శనానికి 8 క్యూలైన్లు: ములుగు ఎస్పీ

image

మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మొత్తం ఎనిమిది క్యూలైన్ల ద్వారా భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తామన్నారు. 3 గేట్ల ద్వారా బయటకు పంపిస్తామని తెలిపారు. ఈసారి మహా జాతరకు 1.50 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తల్లుల దర్శనానికి అందరికీ ఒకటే నిబంధన అమలు చేస్తామన్నారు.

News November 28, 2025

డిసెంబర్ 1న గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

image

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 1న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ‌రూ.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఒకే సమయంలో 100 మంది బరువును ఈ గ్లాస్ బ్రిడ్జి మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా 40 మంది చొప్పున బ్యాచ్‌లను అనుమతించనున్నారు. విశాఖకు పర్యాటకులు ఎక్కువమంది వచ్చే సీజన్ కావడంతో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

News November 28, 2025

ఎన్నికల వేళ రౌడీషీటర్లపై కన్నేయండి: జిల్లా ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరు మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.