News April 2, 2025
నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయిస్తున్నట్లు అధికారపక్షం తెలపగా, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభా సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్, TMC, SP, MIM, DMK వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
Similar News
News April 3, 2025
ఆరెంజ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, HYD, MBNR, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

ప్రతీకార సుంకాలపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇందులో భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ చర్యతో వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలతోపాటు మరికొన్ని వస్తువులపై టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు అంటున్నారు. సుంకాల కారణంగా భారత్‌కు రూ.26 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశ GDPపై 0.1% ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.
News April 3, 2025
ఈ నెలలోనే ఏపీలో PM మోదీ పర్యటన!

AP: అమరావతి పనులను పున:ప్రారంభించేందుకు PM మోదీ ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో CS విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. PM పర్యటన తేదీ త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాని ఇవాళ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాగానే AP పర్యటన తేదీ ఫిక్స్ కానుంది.