News April 2, 2025
WAQF BILL: ఆమోదం పొందడం లాంఛనమే?

కేంద్రం నేడు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. బిల్లు సభ ఆమోదం పొందడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 542 మందికి గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై BJP విశ్వాసంతో ఉంది. కాగా INC, SP, TMC, DMK, AAP, శివసేన(UBT), NCP(SP) తదితర విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
Similar News
News November 19, 2025
భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
News November 19, 2025
43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News November 19, 2025
మూవీ ముచ్చట్లు

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్


