News April 3, 2025

నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు

image

వక్ఫ్ సవరణ బిల్లు 12 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. నేడు చర్చ, ఆమోదం కోసం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉండడంతో పాస్ అవ్వడం లాంఛనమే. ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్ తలాఖ్‌ రద్దు, సిటిజన్‌షిప్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయాల్లోనూ విమర్శలు వచ్చినా ముందుకు సాగింది.

Similar News

News December 5, 2025

ASF: జిల్లాలో మొదటి రాండమైజేషన్ పూర్తి

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.

News December 5, 2025

రాష్ట్రపతి భవన్‌కు పుతిన్.. ఘన స్వాగతం

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించడం గమనార్హం.

News December 5, 2025

హోంలోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్

image

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?