News April 5, 2025
వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు: రవిశంకర్ ప్రసాద్

వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత పెరుగుతుందని, ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘బిల్లు పాసైనంత మాత్రాన మేం ఏ మసీదును, శ్మశానవాటికను తాకబోం. బోర్డుకు సంబంధించిన అంశాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో చూడవచ్చు. నిజానికి వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు. అది చట్టం ద్వారా ఏర్పడింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News April 5, 2025
సినిమాలను వృత్తిగా చూడలేదు: తమన్నా

ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నందుకు హీరోయిన్ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. చదువు విషయంలో టీచర్లు తనకు ఎంతగానో సహకరించారని చెప్పారు. తన 21వ పుట్టిన రోజున పేపర్లో తనపై వచ్చిన ప్రత్యేక కథనం చూసి కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినిమాలను తానెప్పుడూ వృత్తిగా చూడలేదన్నారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల2’ ఈ నెల 17న రిలీజ్ కానుంది.
News April 5, 2025
IPL: పీకల్లోతు కష్టాల్లో CSK

ఢిల్లీతో మ్యాచులో 184రన్స్ టార్గెట్ ఛేదించడానికి చెన్నై కష్టపడుతోంది. రన్స్ రాబట్టేందుకు ఆ జట్టు ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి CSK 5 కీలక వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ 3, కాన్వాయ్ 13, గైక్వాడ్ 5, దూబే 18, జడేజా 2 రన్స్‌కు ఔటయ్యారు. క్రీజులో ధోనీ, విజయ్ శంకర్ ఉన్నారు. విజయానికి 54 బంతుల్లో 107 పరుగులు కావాలి. మరి టార్గెట్‌ను CSK ఛేదించగలదా? కామెంట్ చేయండి.
News April 5, 2025
YELLOW ALERT.. రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో ఈ నెల 7,8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు పొడి వాతావరణం ఉంటుందని, 7న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 8న కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.