News October 5, 2025
ఈ నెల 9న OTTలోకి ‘వార్-2’!

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ మూవీలు 4 వారాల్లో OTTలో రిలీజ్ అవుతున్నాయి.
Similar News
News October 5, 2025
దగ్గు మందు తాగి చిన్నారుల మృతి.. డాక్టర్ అరెస్ట్

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మందు వాడాలని సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సిరప్ తయారు చేసిన TNలోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు వాడిన దగ్గుమందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని, అది విషపూరితమని అధికారులు వెల్లడించారు.
News October 5, 2025
డీమార్ట్ ఆదాయం పెరుగుదల

డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆ సంస్థ ఆదాయం రూ.16,219 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.14,050కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2025 సెప్టెంబర్ నాటికి దేశంలో డీమార్ట్ స్టోర్ల సంఖ్య 432కు చేరింది. ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో డీమార్ట్ బిజినెస్ నిర్వహిస్తోంది.
News October 5, 2025
ఇవాళ చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

HYDలో చికెన్ ధర స్కిన్ లెస్ రూ.230-రూ.240గా ఉంది. కామారెడ్డిలో రూ.240కు విక్రయిస్తున్నారు. విశాఖలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270, స్కిన్‌తో రూ.260, మటన్ కిలో రూ.1000గా ఉంది. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.210-రూ.220, కృష్ణా జిల్లాలో రూ.200-రూ.210, పల్నాడు జిల్లాలో రూ.220-రూ.230గా అమ్మకాలు జరుగుతున్నాయి. నూజివీడులో మటన్ కిలో రూ.750, చికెన్ కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు.