News July 23, 2024
ఆగస్టులో ‘వార్-2’ సెకండ్ షెడ్యూల్!

Jr.NTR, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న ‘వార్-2’ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఆగస్టు 18న ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ మూవీలో కొత్త లుక్లో కనిపించనున్న తారక్, ప్రస్తుతం దేవర పార్ట్-1 షూటింగ్ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ‘వార్-2’ను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
Similar News
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


