News October 8, 2025
నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2’

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>
News October 8, 2025
ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటి?

TG: BC రిజర్వేషన్లపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ట్రిపుల్ టెస్ట్ సర్వే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. 2021లో వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ MH, ఇతరుల కేసుల్లో SC ట్రిపుల్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది. అదేంటంటే?
✎ OBC వెనుకబాటుతనంపై కమిషన్ ఏర్పాటు చేయాలి.
✎ ఆ కమిషన్ ఇచ్చే డేటా బేస్ చేసుకొని రిజర్వేషన్ % నిర్ణయించాలి.
✎ SC, ST, OBC రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు.
News October 8, 2025
జియో భారత్ కొత్త ఫోన్.. ఫీచర్లేమిటంటే

జియో భారత్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, పిల్లల వినియోగానికి అనుగుణమైన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. లొకేషన్ మానిటరింగ్, యూసేజ్ మేనేజింగ్ వ్యవస్థతోపాటు బ్యాటరీ బ్యాకప్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రారంభ ధర ₹799గా నిర్ణయించింది. ఇప్పటికే తెచ్చిన జియో పీసీలలో AI క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామని తెలిపింది.