News August 5, 2025

వార్-2vsకూలీ: రికార్డు సృష్టించేదెవరో?

image

ఈ నెల 14న విడుదల కానున్న <<17189041>>‘వార్-2’<<>>, ‘కూలీ’ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్లతో కూడిన ఈ చిత్రాలు కొంచెం హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశముంది. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ‘ఛావా’(రూ.820+ కోట్లు) ఉంది. మరి ‘వార్-2’, <<17284399>>‘కూలీ’<<>>లో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి?

Similar News

News August 16, 2025

ఆసియా కప్: ఫిట్‌గా సూర్యకుమార్ యాదవ్!

image

టీమ్ఇండియా టీ20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. గాయం నుంచి కోలుకున్న ఆయన ఆసియా కప్‌కు ముందు నిర్వహించిన టెస్టుల్లో పాస్ అయ్యారని వెల్లడించాయి. జట్టు ఎంపికకు ముందు ఈ వార్త సెలక్టర్లకు మరింత రిలీఫ్ ఇవ్వనుంది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత సూర్య సారథ్యంలో జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే.

News August 16, 2025

తిరుమలకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదు: అధికారులు

image

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ <<17369759>>బస్<<>> స్కీమ్ వర్తించదని తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, గరుడ ఏసీ, ప్యాకేజీ టూర్ సహా మరే బస్సులకు ఈ పథకం వర్తించదన్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ స్కీమ్ లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు.

News August 16, 2025

కంటి చూపును మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే..

image

రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్లు చూడటం వల్ల చాలామందిని కంటి సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే కంటి సంరక్షణకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్-A పుష్కలంగా ఉండే క్యారెట్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. సాల్మన్ చేపల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్లను పొడిబారకుండా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ రోగ నిరోధకశక్తిని పెంచి కంటి సమస్యలను నివారిస్తాయి. పాలకూర, బచ్చలికూర చూపును మెరుగుపరుస్తాయి.