News April 15, 2024

స్టాక్‌ మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్.. రూ.5లక్షల కోట్లు ఆవిరి!

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మదుపర్ల రూ.5లక్షల కోట్లు ఆవిరైపోయాయి. సెన్సెక్స్ 845 పాయింట్ల నష్టంతో 73,399 వద్ద ముగియగా.. నిఫ్టీ 249 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది.

Similar News

News April 10, 2026

HDFC వినియోగదారులకు అలర్ట్!

image

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.

News April 10, 2026

ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

image

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.

News April 10, 2026

ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.