News January 6, 2025

మాటల యుద్ధం: కుమార స్వామి X సిద్ద రామ‌య్య

image

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తి కాంట్రాక్టులో 60% క‌మీష‌న్ తీసుకుంటోంద‌ని కేంద్ర మంత్రి కుమార స్వామి ఆరోపించారు. తుమ‌కూరులో కాంగ్రెస్ నేత స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం దానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌ను సీఎం సిద్ద రామ‌య్య కొట్టిపారేశారు. ఈ విష‌య‌మై కుమార స్వామి ఆరోప‌ణ‌లు చేయ‌డం కాకుండా, ఆధారాలు చూపాల‌ని డిమాండ్ చేశారు. విపక్షాలు ఉన్నది కేవలం ఆరోపణలు చేయడానికి కాదన్నారు.

Similar News

News November 4, 2025

జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

image

AP: సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.

News November 4, 2025

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News November 4, 2025

DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/