News January 10, 2025
విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం: సీఎం

TG: వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. మామునూరు విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై సమీక్షించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా ఎయిర్పోర్ట్ ఉండాలని, ద.కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని వివరించారు. కొచ్చి ఎయిర్పోర్ట్ను పరిశీలించాలని సూచించారు.
Similar News
News January 29, 2026
APPLY NOW: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 97 పోస్టులు

<
News January 29, 2026
ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News January 29, 2026
నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.


