News March 18, 2024
వరంగల్ : విదేశాల్లో ఉద్యోగావకాశాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి సోమవారం తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్లాస్టరింగ్ పనులకు జర్మనీలో డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News December 8, 2025
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ నెల 11న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరగనున్న పోలింగ్–కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, తాగునీరు, ర్యాంపులు, విద్యుత్ వంటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 7, 2025
WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్‌కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.
News December 7, 2025
మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


