News November 6, 2024
త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల

TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.
Similar News
News January 11, 2026
కాజీపేట: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు 79 జట్లు

భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో 40 పురుషుల జట్లు, 39 మహిళల జట్లు ఉన్నాయి. 200 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. నాలుగు సింథటిక్ కోర్టులను, 2 కీ కోర్టులను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి పోటీలు సాగనున్నాయి.
News January 11, 2026
కృష్ణా: సంప్రదాయం ముసుగులో జూదం.. కోడి పందాలపై చర్యలేవి?

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంప్రదాయం ముసుగులో జూదం శిబిరాలు వెలిశాయి. కోడిపందాలు, పేకాట, గుండాట కోసం భారీ స్టేజ్లు, ఫ్లడ్ లైట్లతో బరులు సిద్ధమయ్యాయి. సాధారణ రోజుల్లో నిఘా పెట్టే పోలీసులు.. పండుగ మూడు రోజులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాకీల ఉదాసీనత వెనుక అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News January 11, 2026
రూ.1.5లక్షల వరకు ఫ్రీ చికిత్స! త్వరలో కేంద్రం ప్రకటన

నేషనల్, స్టేట్ హైవేలపై ప్రమాదాల్లో గాయపడిన ఒక్కొక్కరికి రూ.1.5లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందించే పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో బాధితులకు 7రోజులు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో డబ్బుల్లేని కారణంతో చికిత్స అందక మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ త్వరలో ఈ పథకాన్ని ప్రకటించనున్నారు.


