News November 19, 2024
వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా: రేవంత్
వరంగల్ బయల్దేరిన CM రేవంత్ ‘X’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరి స్ఫూర్తితో మన భవిత కోసం వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2024
కాంగ్రెస్ సంబరాలపై నవ్వుకుంటున్నారు: ఈటల
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్లో ప్రభుత్వం జరుపుకుంటున్న ఏడాది సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చకు ప్రధాని అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని చెప్పారు.
News November 19, 2024
YCP వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది: చంద్రబాబు
AP: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు దానిని మళ్లీ నిర్మించాలంటే రూ.990 కోట్లు అవసరమని చెప్పారు. ‘గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు చేశాం. కానీ వైసీపీ ఐదేళ్లలో 3.8 శాతం పనులే చేసింది. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News November 19, 2024
BIG BREAKING: కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్
TG: కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.16ను హైకోర్టు కొట్టేసింది. వారి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. దీంతో ఇకపై వారంతా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఉంది. విద్య, వైద్య శాఖల్లో వేలాది మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాగా, హైకోర్టు తీర్పుతో వారిలో ఆందోళన నెలకొంది.