News March 18, 2024
వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Similar News
News September 3, 2025
వరంగల్: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వరంగల్ పట్టణంలోని చింతల్ యఖుత్ పురలో ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థుల అభ్యాస పరిస్థితులను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు.
News September 3, 2025
WGL: గంజాయి ముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్స్ కంట్రోల్ టీం భారీ ఆపరేషన్‌లో భాగంగా 763 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.3.81 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖానాపూర్ మండలం, చిలుకలగుట్ట ఏరియాలో నిందితులు తెల్లటి బస్తాలను దింపుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
News September 2, 2025
భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం

భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.