News December 1, 2024
వార్మప్ మ్యాచ్.. భారత్ టార్గెట్ 241

టీమ్ ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టు 43.2 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌటైంది. ఆ టీమ్‌లో సామ్ కోన్స్టాస్ 107, జాకబ్స్ 61, క్లేటన్ 40 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్, సుందర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే భారత్ 46 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.
Similar News
News November 28, 2025
ALERT.. పెరగనున్న చలి

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


