News August 9, 2024
మహేశ్ బాబుకు వార్నర్ బర్త్ డే విషెస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈమేరకు మహేశ్ బాబు వర్కౌట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే లెజెండ్’ అంటూ రాసుకొచ్చారు. వార్నర్ ఐపీఎల్ ద్వారా తెలుగు క్రీడా, సినిమా ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.
Similar News
News March 30, 2026
గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.
News March 30, 2026
75 ఏళ్ల వయసులో మహిళల విడాకులు.. భర్తల వయసు ఎంతంటే?

సిమ్లా(HP)లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు భర్తలకు విడాకులు ఇచ్చారు. రెండు ఘటనల్లోనూ భార్యల కంటే భర్తల వయసు(59, 39 ఏళ్లు) తక్కువ ఉండటం గమనార్హం. అలాగే పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారు. మొదటి కేసులోని జంట 1990లో పెళ్లాడగా 2010 నుంచి దూరంగా ఉంటోంది. రెండో కేసులో జంట 2008లో వివాహం చేసుకోగా 2021 నుంచి విభేదాలు మొదలయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సమ్మతితో విడిపోయారు.
News March 30, 2026
రిటైర్మెంట్, పెన్షన్లను Gen Z నమ్మట్లే!

ఆర్థిక సవాళ్ల కారణంగా Gen Z(1997-2012) రిటైర్మెంట్‌ను ఒక ఆప్షన్‌గానూ భావించట్లేదు. పెన్షన్లపై నమ్మకం లేదని, జీవితాంతం పనిచేస్తూనే ఉండాల్సి వస్తుందని 12శాతం మంది యువత భావిస్తోంది. ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులే ఇందుకు కారణం. అయితే చిన్న వయసు నుంచే పొదుపు చేస్తే భారీ లాభం ఉంటుందని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


